సోమవారం, 28 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఏప్రియల్ 2025 (13:02 IST)

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

neha singh
పహల్గాం ఉగ్రవాడి ఘటన అనంతరం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జానపద గాయని రాథోడ్‌పై లక్నో పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేస్తూ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పెట్టినట్టు పేర్కొన్నారు. మతం ఆధారంగా ఒక సమాజంపై మరో సమాజాన్ని రెచ్చగొట్టేలా పదేపదే ప్రయత్నించారని ఆరోపించారు.
 
గాయని నేహాసింగ్‌పై లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత కింద ఆమెపై పలు అభియోగాలు నమోదయ్యాయి. వాటిలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రశాంతతకు భంగం కలిగించడం, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం వంటివి వున్నాయి. ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.