Lunar Eclipse: చంద్రగ్రహణం- ఈ రాశుల వారు జాగ్రత్తగా వుండాలి
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం నాడు సంభవించనుంది. ఈ గ్రహణం రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రాశుల వారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు.
వీటిలో మిథున, సింహ రాశి వారికి ఈ గ్రహణం వృత్తిపరమైన జీవితంలో సవాళ్లను తీసుకురావొచ్చు. కెరీర్‌లో వచ్చే అవకాశాలను చేజార్చుకోకుండా ఉండాలంటే.. అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. వృషభ రాశి వారికి నిందలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనస్తాపం చెందవచ్చు.
కన్యారాశి వారు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వ్యక్తిగత నష్టానికి దారితీస్తాయి. ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. వృశ్చిక, ధనుస్సు రాశుల వారు ప్రతికూల ఆలోచనలున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంకా కుటుంబంలో కలహాలు, ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.