Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?
అంగారక సంకష్ట చతుర్థి నేడు. ఈ రోజున వినాయకునికి విశేష పూజలు ఆలయాల్లో జరుగుతాయి. సాయంత్రం పూట అభిషేకాదుల్లో పాల్గొంటే సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. మంగళవారం అంగారకుడికి ప్రాతినిధ్యం వహించే రోజు కావడంతో కుజదోషాలు తొలగిపోవాలంటే.. వినాయకుడిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.
ప్రతి నెలా పూర్ణిమ తర్వాత కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు సంకష్టి చతుర్థి ఉపవాసం పాటిస్తారు. మంగళవారం నాడు వచ్చే సంకష్టి చతుర్థి తిథిని అంగారక చతుర్థిగా పాటిస్తారు. ఆగస్టు 12వ తేదీన వచ్చిన ఈ చతుర్థికి విశిష్ట ఫలితాలు వున్నాయి.
'గణేశ పురాణం', 'స్మృతి కౌస్తుభం' వంటి అనేక పవిత్ర గ్రంథాలలో చతుర్థి వ్రతం ప్రాముఖ్యతను ప్రస్తావించడం జరిగింది. అంగారక చతుర్థి రోజున భక్తులు గణేశుడిని, భక్తి- అంకితభావంతో పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి వ్యక్తి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.
భక్తులు చతుర్థి తిథి సూర్యోదయం నుండి వ్రతాన్ని ఆచరిస్తారు. సాయంత్రం గణేశ పూజ చేసి చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే వ్రతాన్ని విరమిస్తారు. భక్తులు వినాయకుడికి మోదకాలతో పాటు అనేక నైవేద్యాలు అర్పిస్తారు. 21 పత్రాలను సమర్పిస్తారు. ఆయన ఆశీస్సులు కోరుకుంటారు. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.
సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా , చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.