శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (08:05 IST)

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

lord shiva
lord shiva
కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివలింగం మీద రాళ్ల ఉప్పు వుంచి నమస్కారం చేయడం ద్వారా మహిళలకు దీర్ఘసుమంగళి యోగం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కార్తిక మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి. జాతకంలో నవగ్రహాలు అనుకూలించాలంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయాలి. 
 
మనశ్శాంతి కోసం వెన్నతో అభిషేకించాలని సూచిస్తున్నారు. పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ద్రాక్షపండ్ల రసంతో శివాభిషేకం నిర్వహించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే శత్రుబాధలు తొలగిపోవాలనుకున్న వారు మాస శివరాత్రి రోజున ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేయాలని.. ఈ రోజున శివాలయాల్లో జరిగే పూజలు, అభిషేకాల్లో పాల్గొనే వారికి సకల దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.