శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (16:30 IST)

అక్టోబర్ 31న తిరుమల ఆలయంలో దీపావళి ఆస్థానం

Diwali Asthanam
Diwali Asthanam
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 31న తిరుమల ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.
బంగారు వాకిలిలోని ఘంటా మండపంలో ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఈ ఆచారం జరుగుతుంది. శ్రీ మలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. 
 
సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
 
కాగా సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 31న తిరుప్పావాడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది.