శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (14:08 IST)

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 11 అలంకార గొడుగులు.. శోభాయాత్ర ప్రారంభం

Umbrellas procession
Umbrellas procession
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 11 అలంకార గొడుగుల ఊరేగింపు బుధవారం చెన్నై నగరంలో ప్రారంభమైంది. చెన్నై నుండి భక్తులు గొడుగులు పట్టుకుని ఊరేగింపుగా నడుచుకుంటూ తిరుమల ఆలయానికి సమర్పించడానికి గరుడ సేవకు ఒక రోజు ముందు అక్టోబర్ 7న పుణ్యక్షేత్రమైన తిరుమలకు చేరుకుంటారు. 
 
హిందూ ధర్మార్థ సమితి గతంలో విరామం తర్వాత 2005 నుండి తిరుమలకు గొడుగుల సమర్పణ ‘తిరుక్కుడై ఉత్సవం’ నిర్వహిస్తోంది. చెన్నై నగరం నుంచి శోభాయాత్ర ప్రారంభమయ్యే ముందు చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో 11 గొడుగులకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ధర్మార్థ సమితి ట్రస్టీలు వేదాంతం, ఆర్‌ఆర్‌ గోపాల్‌ పాల్గొన్నారు.
 
నగరంలోని పలు ప్రాంతాలను చుట్టి అక్టోబరు 4న సౌమ్య దామోదర పెరుమాళ్ ఆలయానికి, 5న ఆవడికి, 6న తిరువళ్లూరుకు, 7న తిరుచానూరుకు గొడుగులు చేరుకుంటాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు గొడుగులు సమర్పించిన అనంతరం ఈ ఊరేగింపు తిరుమలకు చేరుకుంటుంది. 
 
అదే రోజున.. మిగిలిన తొమ్మిది గొడుగులను తిరుమల దేవస్థానం అధికారులకు అప్పగించనున్నారు. సమితి ట్రస్టీ ఆర్‌ఆర్‌ గోపాల్‌ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఉత్సవం నిర్వహిస్తున్నామని, విరాళాలు, నైవేద్యాలు ఏ రూపంలోనూ స్వీకరించబోమన్నారు.