శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (14:37 IST)

58 ఏళ్ల మైక్ టైసన్‌కు షాక్ -యూట్యూబర్ చేతిలో చిత్తుగా ఓటమి

Mike Tyson
Mike Tyson
ప్రపంచ గొప్ప బాక్సర్‌లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్‌కు షాక్ ఎదురైంది. ఓ 27 ఏళ్ల బాక్సర్ జేక్ పాల్ మైక్ టైసన్‌ను చిత్తుగా ఓడించాడు. మ్యాచ్ ప్రారంభంలో 58 ఏళ్ల వెటరన్ బాక్సర్ అద్భుతంగా ప్రారంభించాడు. కానీ పాల్ తన చాకచక్యాన్ని ప్రదర్శించి, ఎటాక్ చేసి టైసన్ అలసిపోయేలా చేశాడు. ఈ మ్యాచులో మైక్ టైసన్ మొదట దూకుడుగా ప్రారంభించాడు. ఇక ఐదో రౌండ్‌లో టైసన్ పునరాగమనం చేశాడు. 
 
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బాక్సర్ మైక్ టైసన్ 58 ఏళ్ల వయసులో 19 ఏళ్ల తర్వాత మరోసారి బరిలోకి దిగాడు. కానీ యూట్యూబర్ చేతిలో ఓడిపోయాడు. ఈ పోరు టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్‌లోని ఏటీ అండ్ టీ స్టేడియంలో జరిగింది. 
 
దీంతో మ్యాచ్‌ను పాల్ 78-74తేడాతో గెలుచుకున్నాడు. అయితే చివరికి పాల్ టైసన్ ముందు వంగి గౌరవంగా నమస్కారం చేయడం విశేషం. ఈ పోరుకు ముందే మైక్ టైసన్ జేక్ పాల్‌ను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరినీ అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.