శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (19:57 IST)

పెళ్లికి నో చెప్పిందని కాలేజీ స్టూడెంట్‌పై కత్తితో దాడి... ఎక్కడంటే?

Love
19 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై అకృత్యం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో సోమవారం మెదక్ జిల్లాలో ఒక యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. తనతో ఆన్‌లైన్‌లో స్నేహం చేసి ప్రేమ, పెళ్లికి నో చెప్పిందని ఆ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలి చేతికి గాయాలతో ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. 
 
ఓపెన్ యూనివర్శిటీకి చెందిన మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన నిందితుడు కళాశాల సమీపంలో ఆమెతో గొడవకు దిగి కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
 
ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుడు తన వద్దకు వచ్చి తన భావాలను వ్యక్తపరిచాడని, ఆమె తిరస్కరించడంతో తనపై కత్తితో దాడి చేసి కుడి చేతికి గాయమైందని ఆమె పేర్కొంది.
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా నిందితుడు పరిచయం. వారు గతంలో బెంగళూరులో కలుసుకున్నారు. అయితే ప్రేమ, పెళ్లికి యువతి అంగీకరించకపోవడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
 
నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.