హైదరాబాదులో భారీ వర్షాలు- ముషీరాబాద్‌లో 184.5 మి.మీ వర్షపాతం
హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగంరో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని కొన్ని కాలనీలలో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. బుధవారం రాత్రి నుండి, ముషీరాబాద్ ప్రాంతాలలో 184.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ శుక్రవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం రాత్రి నుండి వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక ప్రాంతాలలో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాలు సాధారణ జీవితాన్ని స్తంభింపజేశాయి. అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు, ట్రాఫిక్ స్తంభించించాయి.
రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, బోరబండ, నాంపల్లి, టోలిచౌకి, ఇతర ప్రాంతాలు ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్నాయి.