శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (19:36 IST)

ప్రయాణికులకు హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ షరతు.. నో రొమాన్స్.. కీప్ డిస్టెన్స్.. స్టే కామ్

cab driver rule
ఇటీవలికాలంలో బెంగుళూరు క్యాబ్ డ్రైవర్లు లేదా ఆటో డ్రైవర్లు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు ఆటో, క్యాబ్ డ్రైవర్ల దురుసు ప్రవర్తన కారణంగా వారికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు డ్రైవర్లు మాత్రం తమ మంచి పనులు కారణంగా పత్రికలుక ఎక్కుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బెంగుళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఆరు నిబంధనలతో పెట్టిన చిన్నపాటి నోటీసు బోర్డు ఇపుడు బాగా వైరల్ అయింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్టయిన ఆ బోర్డు సంచలనం సృష్టించింది. 
 
ఇప్పుడు ఇదే కోవలో హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్‌కు సంబంధించిన వార్నింగ్ నోట్ కూడా బాగా వైరల్ అవుతోంది. తన క్యాబ్ ఎక్కే ప్రయాణికులకు వార్నింగ్ ఇవ్వడం ఆ నోట్లో ఉంది. ముఖ్యంగా జంటలను ఉద్దేశించి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నోట్లో డ్రైవర్... క్యాబ్ ఎక్కిన తర్వాత ప్రయాణికులు కుదురుగా కూర్చోవాలని, ఒకరికొకరు ఎడంగా ఉండాలని చెప్పడం మనం చూడొచ్చు.
 
ప్రత్యేకంగా జంటలను ఉద్దేశించి అందులో సందేశం ఉంది. "వార్నింగ్... నో రొమాన్స్. ఇది క్యాబ్, మీ ప్రైవేట్ స్థలం కాదు. కాబట్టి దయచేసి దూరం పాటించండి. ప్రశాంతంగా ఉండండి" అని ఆ నోట్లో ఉంది.
 
ఈ నోట్‌ను మొదట 'ఎక్స్' (ట్విట్టర్)లో వెంకటేశ్ అనే యూజర్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత 'హాయ్ హైదరాబాద్' అనే ఎక్స్ ఖాతా ద్వారా మళ్లీ పోస్ట్ అయింది. ఇప్పుడిది నెట్టింట నవ్వులు పూయిస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "ఇది క్యాబ్ ప్రయాణికులకు నైతికపరంగా అవసరమైన సందేశం" అని ఒకరు కామెంట్ చేశారు.