శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (09:44 IST)

మెట్టు దిగిన మంత్రి కొండా సురేఖ... సమంతపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా..

konda surekha
అక్కినేని నాగ చైతన్య, ఆయన మాజీ భార్య సమంతలను ఉద్దేశించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం, చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే, హీరోయిన్ సమంత కూడా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను రాక్షసితో పోల్చారు. ఈ సమస్య పెద్దదవుతుందని గ్రహించిన మంత్రి కొండా సురేఖ ఓ మెట్టు దిగి.. సమంతను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటునట్టు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇదే అంశంపై ఆమె ట్వీట్ చేశారు. 
 
"తన వ్యాఖ్యలను ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయుకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం మాత్రమేనని అన్నారు. కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని స్పష్టం చేశారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శనం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తన వ్యాఖ్యల వల్ల సమంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మనస్తాపానికి గురైనట్టయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.