సోమవారం, 29 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 సెప్టెంబరు 2025 (09:26 IST)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మూసారంబాగ్‌, మూసీ నదులు ఉగ్రరూపం.. (video)

Hyderabad Rains
Hyderabad Rains
హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మూసారంబాగ్‌, మూసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జి సెంట్రింగ్‌పై ఇనుపరాడ్లు కొట్టుకుపోయాయి. ఒకవైపు మూసారంబాగ్ బ్రిడ్జికి ఆనుకొని ఉన్న కొత్త హై లెవెల్ నిర్మిస్తున్నారు. 
 
దాని నుంచి కూడా వరదనీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా మూసి ఉగ్రరూపం దాల్చడంతో వరద నీరు ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతం అంత పూర్తిగా నీట మునిగింది. 
 
బ్రిడ్జీను అనుకొని ఉన్న అంబేద్కర్ నగర్ ఇళ్లలోకి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరింది. మూసీ వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చడంతో ఒక్కసారిగా భారీ నీళ్లు వచ్చి చేరాయి. 
 
ముందస్తు హెచ్చరిక కూడా లేకుండా గండిపేట ఎత్తడంతో అల్లకల్లోలాంగా మారిందని స్థానికులు వాపోయారు. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో పాతబస్తీ పురాణాపూల్‌లోని శ్మశాన వాటిక కూడా పూర్తిగా నీట మునిగింది.