మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

jail
తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్ నగరంలోని పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అలాగే, బాధితురాలికి భారీగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
 
గత 2016లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అఖిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక గర్భవతి కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ పక్షాన వాదనలు బలంగా వినిపించారు. బాధితురాలి వాంగ్మూలం, కీలకమైన వైద్య నివేదికలు, ఇతర సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం, అఖిల్‌ను దోషిగా నిర్ధారిస్తూ అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ.8 లక్షల పరిహారం అందించాలని తీర్పులో స్పష్టం చేసింది.