శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (18:58 IST)

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

keertana
పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండరు. ఒకవేళ తగినంత మంది టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నారపనేని పల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాలలో కేవలం ఒక్కరంటే ఒక్క విద్యార్థిని మాత్రమే ఉంది. ఆ విద్యార్థిని కోసం ప్రభుత్వం ప్రతి యేటా అక్షరాలా రూ.12.48 లక్షలను ఖర్చు చేస్తుంది. 
 
నారపనేని పల్లి ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని కీర్తన కోసం ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఆ ఉపాధ్యాయుడుకి నెలకు రూ.1,01,167ను వేతనంగా చెల్లిస్తుంది. ఆ ప్రకారంగా టీచర్‌కు 12 నెలలకుగాను రూ.12.14 లక్షలు చెల్లిస్తుంది. మధ్యాహ్న భోజనం నిమిత్తం వంట మనిషికి నెలకు రూ.3000 ఇస్తుండగా, పారిశుద్ధ్య కార్మికురాలు, స్కూల్ మెయింటైన్ గ్రాండ్, స్పోర్ట్స్ గ్రాండ్.. అన్నీ కలిపి సుమారు రూ.12.84 లక్షల ఖర్చు చేస్తున్నారు. ఈ విషయం ఇపుడు మీడియాలో వైరల్ కావడంతో ఇకపై ఈ పాఠశాలను కొనసాగిస్తారో లేక సమీపంలోని పాఠశాలలో విలీనం చేస్తారో వేచి చూడాల్సిందే.