శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:49 IST)

జెర్సీ డైరక్టర్‌తో విజయ్ దేవరకొండ.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ?

Bhagyasree Borse
Bhagyasree Borse
లైగర్ విజయ్ దేవరకొండ సినీ కెరీర్‌లో గట్టిదెబ్బ కొట్టింది. ఆ తర్వాత కుషీ, లేటెస్ట్ ఫ్యామిలీ స్టార్ సినిమాలకు మంచి టాక్ రాలేదు. ఇక తాజాగా జెర్సీ మేకర్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ 12వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని కాస్టింగ్ మార్పులు జరుగుతున్నాయి.
 
విజయ్ దేవరకొండ 12 కోసం శ్రీలీలని ముందుగా అనుకున్నారు. కానీ శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుందని టాక్. దీంతో మేకర్స్ శ్రీలీల స్థానంలో కొత్త అమ్మాయిని ఎంచుకున్నారని టాక్. రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాకు భాగ్యశ్రీ బోర్సే మొదట సైన్ చేసింది. ఈమెనే విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా నటింపజేయనున్నట్లు తెలిసింది. 
Bhagyasree Borse
Bhagyasree Borse
 
జెర్సీ సినిమాతో గౌతమ్ తిన్ననూరి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. దీంతో విజయ్ అతనితో చేసే సినిమాపై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.