శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (10:38 IST)

నాగచైతన్య కోసం శోభిత అదంతా చేస్తుందా?

nagachaitanya
టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ళల వివాహం త్వరలో జరుగనుంది. నాగ చైతన్య తాతయ్య.. ఎవర్ గ్రీన్ అక్కినేని నాగేశ్వరరావును గౌరవించే దిశగా శోభితా ధూళిపాళ్ళ మేకప్ ఆర్టిస్టులకు వీడ్కోలు పలుకుతోంది. 
 
ఏ వధువుకైనా వివాహాలు ఒక పెద్ద సందర్భం. బిటౌన్ వధువులు తమ ఉత్తమంగా కనిపించేందుకు ఖరీదైన స్టైలిస్ట్‌లను ఎంపిక చేసుకుంటారు. అలియా, అనుష్క, ప్రియాంక, కత్రీనా భారీ ఖరీదుతో స్టైలిస్టులను నియమించుకుంటారు.  
 
అయితే, శోభిత సంప్రదాయాలకు విలువ నిస్తూ.. అక్కినేని కుటుంబానికి తగినట్లు తెలుగు సంప్రదాయాలకు విలువ నిస్తోంది. కాంచీపురం చీరను పెళ్లికి ధరించాలని శోభిత డిసైడ్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహం చేసుకునేందుకు ఓకే చెప్పింది. భారీగా మేకప్ ఆర్టిస్టుల కోసం  ఖర్చు పెట్టకూడదని డిసైడ్ అయ్యింది. 
 
ఇక సినిమాల సంగతికి వస్తే.. శోభిత ఇటీవల లవ్, సితారలో కనిపించింది. నాగ చైతన్య, సాయి పల్లవితో కలిసి తాండల్‌ సినిమాలోనటిస్తున్నాడు.