మంగళవారం, 2 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (17:46 IST)

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Shivani Nagaram
Shivani Nagaram
90s మిడిల్ క్లాస్  ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ మూవీకి  నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు.  ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ షేర్ చేసుకున్నారు హీరోయిన్ శివానీ నాగరం.
 
- మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి నా చిన్నప్పటి స్నేహితుడు. ఆయన ద్వారా లిటిల్ హార్ట్స్ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. మంచి స్టోరీ ఉంది, విను అని సింజిత్ చెప్పాడు. డైరెక్టర్ సాయి మార్తాండ్ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ప్రతి క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది.
 
- అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ సెలెక్టివ్ గా వెళ్లాలని వెయిట్ చేశాను. సినిమాను థియేటర్ దాకా వెళ్లి చూడాలంటే అందులో మంచి కంటెంట్ ఉండటం లేదు. అలా కంటెంట్ ఉన్న మూవీ చేయాలనే టైమ్ తీసుకున్నా.
 
- అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. లిటిల్ హార్ట్స్ లో అలా కాదు. ఇది కంప్లీట్ లైట్ హార్టెడ్ మూవీ. కాలేజ్ డేస్ లో ఉండే ఫన్ తో సాగుతుంది. లవ్ స్టోరీ ఉన్నా, అందులో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉండవు.
 
- ఇందులో కాత్యాయని అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవలేదు. కాత్యాయని క్యారెక్టర్ ప్రేక్షకులు తమతో తాము పోల్చుకునేలా ఉంటుంది. అఖిల్, కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే మీకు మీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది.
 
- కాత్యాయని క్యారెక్టర్ నా లైఫ్ లో కూడా రిలేటబుల్ గా ఉంది. నేనూ కాలేజ్ లో యావరేజ్ స్టూడెంట్ నే. స్టూడెంట్ లైఫ్ లో మనం చేసిన పనులన్నీ ఈ సినిమా చూస్తుంటే గుర్తొస్తాయి. ఫస్ట్ నుంచి ఈ మూవీ థియేటర్ కోసం చేసిందే. వంశీ నందిపాటి, బన్నీవాస్ గారు ఎంటర్ అయ్యాక, బిగ్గర్ స్కేల్ రిలీజ్ కు తీసుకెళ్తున్నారు. ఓవర్సీస్ లో కూడా మా మూవీ బాగా రిలీజ్ అవుతోంది.
 
- మౌళి కంటెంట్ క్రియేటర్ నుంచి యాక్టర్ అయ్యాడు కాబట్టి సోషల్ మీడియాలో రీల్స్ బాగా చేస్తుంటాడు. నేను డైరెక్ట్ గా మూవీస్ లోకి వచ్చాను, నేను వాళ్లలా సోషల్ మీడియాలో దూకుడుగా ఉండలేను. లిటిల్ హార్ట్స్ సినిమా ఎంత ఫన్ గా ఉందో, షూటింగ్ చేసేప్పుడు కూడా అంతే హ్యాపీగా చేశాం. ఎక్కువమంది సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి అంతా ఫ్రెండ్స్ లా కలిసిపోయాం. రాజీవ్ కనకాల, అనిత చౌదరి, కాంచి, సత్యకృష్ణ..వీళ్లంతా మాతో బాగా కలిసిపోయి, మమ్మల్ని సెట్ లో బాగా ఎంకరేజ్ చేసేవారు. వీళ్లతో కలిసి నటించడం మాకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. సత్యకృష్ణ, కాంచి నాకు పేరెంట్స్ గా నటించారు. రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ ఫన్ గా ఉంటుంది. కాంచి గారి క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది.
 
- ఈ సినిమాతో నాకు స్కూల్, కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. సమ్మర్ క్యాంప్ కు వెళ్లిన ఫీల్ కలిగింది. నేను చదివింది గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, అప్పుడు అబ్బాయిలతో ఇలా మాట్లాడే అవకాశం లేదు. బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా అని చూడకుండా, మంచి కంటెంట్ ఉన్న సినిమా అని నమ్మి రిలీజ్ చేస్తున్నారు. ఈటీవి విన్ నుంచి వస్తున్న ఫస్ట్ థియేట్రికల్ మూవీ ఇది కావడం విశేషం.
 
- మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజాగాడికి పాట నా ఫేవరేట్ సాంగ్. ఈ పాటలో నేను,  మౌళి కలిసి ఒక హుక్ స్టెప్ చేశాం.
 
- నా గత చిత్రానికి దీనికి ఏడాది గ్యాప్ వచ్చింది. మంచి ప్రాజెక్ట్ కోసమే వేచి చూశా. ఈ మధ్యలో కొత్త హీరోయిన్స్ చాలా మంది వచ్చి ఉండొచ్చు. అయితే నేను అవన్నీ ప్లాన్ చేసుకోని చూడను. నా దగ్గరకు మంచి అవకాశం వస్తే చేస్తా. థియేటర్, ఓటీటీ అనే తేడాలు చూడాలనుకోవడం లేదు. ఎంత పెద్ద సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సిందే. ఓటీటీలో వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చినా చేసేందుకు రెడీగా ఉన్నాను.
 
- నా మొదటి చిత్రంలో బాగా ఏడ్చేశాను. రెండో సినిమాలో మంచి ఫన్ ఉన్న నవ్వించే క్యారెక్టర్ దొరికింది. ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ చేయాలని అనుకుంటున్నా. నెక్ట్స్ సుహాస్ తో హే భగవాన్ అనే మూవీలో నటిస్తున్నా. ఇదొక కంప్లీట్ హిలేరియస్ ఎంటర్ టైనర్. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేశాం. షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలు లైనప్ లో ఉన్నాయి.