శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:31 IST)

తెలంగాణాలో "పుష్ప-2" టిక్కెట్ ధరల పెంపుపై న్యాయ పరీక్ష!!

Pushpa 2 The rule
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా కలిసి నటించిన "పుష్ప-2" చిత్రానికి టిక్కెట్ ధరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
ఈ నెల 5వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించ ప్రీమియర్ షో టిక్కెట్ ధరపై రూ.800 వరకు పెంచుకోవడానిక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు రూ.200, ఆ తర్వాత కూడా పెంచుకోవడానికి అవకాశమిచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
కాగా, పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడిగా నటించింది. జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే.