శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-10-2024 గురువారం దినఫలితాలు : ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించాలి...

Leo
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. బంధువులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించాలి. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
బంధుమిత్రులతో మితంగా సంభాషించండి. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగులకు కొత్త సమస్యలెదురవుతాయి. నోటీసులు అందుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఎదుటివారి తీరును గమనించి మెలగండి. వాగ్వాదాలకు దిగవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. కొత్త పరిచయాలు బలపడతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. కొత్త సమస్యలెదురవుతాయి. ఏ పనీ సక్రమంగా సాగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వం స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. మీ జోక్యం అనివార్యం. ఆహ్వానం అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణ సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులను సంప్రదిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు అధికం. పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సంతానం కృషి ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వేడుకకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు భారమనిపించవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు శుభయోగం. ఉల్లాసంగా గడుపుతారు. కీలకపత్రాలు అందుతాయి. ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆప్తుల హితవు కార్మోన్ముఖులను చేస్తుంది. పట్టుదలతో అడుగు ముందుకేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.