మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కష్టించినా ఫలితం ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సోదరుల ఆంతర్యం అవగతమవుతుంది. ఆప్తుల చొరవతో సమస్య సానుకూలమవుతుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అనవసర జోక్యం తగదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆపన్నులకు సాయం అందిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని పనులు కావు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆచితూచి వ్యవహరించండి. తొందరపడి హామీలివ్వవద్దు. ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యం సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు ప్రయోజనకరం. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వేడుకకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. బంధువులతో కాలక్షేపం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. పత్రాలు అందుకుంటారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సాయం అందిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణ ఒత్తిడి తొలగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుతాయి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కొంతమంది వ్యాఖ్యలు నీరుగారుస్తాయి.. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఇంటి సమస్యలు చికాకుపరుస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. మనోధైర్యంతో మెలగండి. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అధికం, పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నోటీసులు అందుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. దూరపు బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.