బుధవారం, 1 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2025 (18:12 IST)

Mercury transit 2025: బుధ గ్రహ పరివర్తనం.. ఈ రాశుల వారికి లాభదాయకం

Astrology
బుధ గ్రహ పరివర్తనం 2025.. శుక్రుని సొంతింటిలోకి బుధుడు ప్రవేశించడం ద్వారా ఈ మూడు రాశులవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నవగ్రహాల్లో ప్రతి గ్రహం పరివర్తనం చెందుతూ వుంటాయి. ఆ సమయంలో అవి ఇతర గ్రహాల్లో కలయిక ల్ల శుభ, అశుభ యోగాలను ఇస్తాయి. వాక్చాతుర్యం, బుద్ధికుశలత, వ్యాపారాలకు కారకుడైన బుధ గ్రహం ప్రస్తుతం అక్టోబర్ 3వ తేదీన తులారాశిలోకి ప్రవేశించడం ద్వారా ఆ రాశివారికి శుభ ఫలితాలు వుంటాయి. 
 
ఒక రాశి నుంచి మరో రాశికి ఒక గ్రహం సుమారు 23 రోజులకు ఓ సారి పరివర్తనం చెందుతుంది. బుధుడు తన స్థానాన్ని మార్చడం ద్వారా 12 రాశుల్లో మార్పు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బుధుడు తులారాశిలోకి పరివర్తనం చెందడం ద్వారా మేషం, తులా రాశి, మీన రాశి వారికి శుభం చేకూరుతుంది. 
 
బుధ పరివర్తనం కారణంగా మేష రాశికి శుభ ఫలితాలు వున్నాయి. ఈ క్రమంలో మేష రాశి వారికి బుధ పరివర్తనం శుభ ఫలితాలను ఇస్తుంది. సంపద చేకూరుతుంది. కొత్త ఉపాధి అవకాశాలు చేకూరుతాయి. జీవిత లక్ష్యం నెరవేరుతుంది. ఇతరులను ఆకట్టుకునే రీతిలో వ్యాపారాల్లో వృద్ధి గడిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి చేకూరుతుంది. జీతం పెరిగే అవకాశం వుంది. టీమ్ లీడర్స్‌లకు కలిసి వచ్చేకాలం. 
 
తులారాశికి లగ్నంలో బుధ పరివర్తనం చెందడం వల్ల తులా రాశి జాతకులకు మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఐక్యత నెలకొంటుంది. కొత్త అవకాశాలు వరిస్తాయి. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. తద్వారా సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి. 
 
మీనరాశి జాతకులు బుధుడి పరివర్తనం కారణంగా శుభాలు చేకూరుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతి చేకూరుతుంది. లాభకరమైన ఒప్పందాలు చేకూరుతాయి. పొదుపు సాధ్యం అవుతుంది. వ్యాపారాల్లో లాభం గడిస్తారు. జీవితం సుఖమయం అవుతుంది.