బుధవారం, 1 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

Daily Horoscope: 30-09-2025 మంగళవారం ఫలితాలు- మిమ్ముల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు.
 
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వాగ్ధాటితో రాణిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు సకాలంలో చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. ప్రముఖులకు చేరువవుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. రుణఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. పరిచయస్తులు మీ వైఖరిని తప్పుపడతారు. మనోధైర్యంతో మెలగండి. అప్రియమైన వార్త వింటారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచవద్దు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పిల్లలకు శుభం జరుగుతుంది. గృహమరమ్మతులు చేపడతారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు ఒక పట్టాన పూర్తికావు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.