శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 16 సెప్టెంబరు 2024 (21:26 IST)

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

Tapsee pannu
వినోదం, ఉత్సాహం, స్టైల్‌తో కలగలిపిన ఈ సరికొత్త కలెక్షన్ రాబోయే సీజన్‌కు అద్భుతంగా సరిపోతుంది. విభిన్నమైన, ఫ్యాషనబుల్ ఐవేర్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది వోగ్ ఐవేర్. ఇప్పటికే తమ ఐవేర్‌తో ఎంతోమంది వినియోగదారుల్ని సంపాదించుకున్న వోగ్ ఐవేర్.. ఇవాళ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేటెస్ట్ కలెక్షన్‌ను వోగ్ ఐవేర్ బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్ను లాంచ్ చేశారు. ఇప్పటి తరానికి నచ్చే ఆధునిక ట్రెండ్‌తో పాటు అత్యధిక నాణ్యతతో, అదే సమయంలో తాప్సీ యొక్క విభిన్నమైన స్టైల్‌తో.. అన్నింటికి మించి వోగ్ ఐవేర్ యొక్క బ్రాండ్‌కు తగ్గట్లుగా ఈ సరికొత్త కలెక్షన్‌ను డిజైన్ చేశారు.
 
ఈ సరికొత్త కలెక్షన్లో మొత్తం 5 రకాల మోడల్స్, 3 సన్ గ్లాసెస్, 2 ఆప్టికల్ ప్రేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రెష్ కలర్‌తో చాలా వేటికవే విభిన్నంగా ఉన్నాయి. ఇవన్నీ మీ స్టైల్‌ను మరింతగా పెంచుతాయి. అంతేకాకుండా ఇందులో విభిన్న రకాలైన ఆకృతులు కూడా ఉన్నాయి. పెద్ద సీతాకోక చిలుక, సైనస్ క్యాట్ ఐ, రెట్రో రెగ్యులర్ వంటి వివిధ రకాల ఆకృతులు ఈ సరికొత్త కలెక్షన్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి కళ్లజోడు ఖచ్చితమైన శ్రద్ధతో రూపొందించబడింది. మరోవైపు మెటల్ నోస్ బ్రిడ్జ్, ప్రత్యేకమైన డీబోస్డ్ ప్యాటర్న్ లాంటి డెకర్ ఎలిమెంట్‌లను ఈ కలెక్షన్ కలిగి ఉంటాయి.
 
“నాకు ఎంతో ఇష్టమైన ఐవేర్ వోగ్. అయితే ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. కారణం నా ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్‌ను వోగ్ ఐవేర్ లాంచ్ చేసినందుకు. టర్కోయిజ్ నాకు చాలా ఇష్టమైన రంగు. ఈ రంగు ఎవ్వరికైనా ఇట్టే నప్పుతుంది. మన లుక్‌ని మరింతగా ఎలివేట్ చేస్తుంది. నా అన్ని స్టైల్స్‌కు పర్‌ఫెక్ట్ సరిపోయే రంగుగా నేను ఎప్పుడూ దీన్నే ఎంచుకుంటాను. ఇందులో ప్రతీ కళ్లజోడు చాలా విభిన్నంగా ఉంటుంది. అన్నింటికి మించి నా వ్యక్తిగత స్టైల్ అయినటువంటి ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంటుంది అని అన్నారు బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్ను.
 
ఈ కలెక్షన్లో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది కళ్లజోడు లోపల చాలా చిన్నగా 'తాప్సీ x వోగ్ ఐవేర్', టెంపుల్ లిప్స్‌పై తాప్సీలోగో ఉన్నాయి. ఈ కలెక్షన్ అంతా స్టైల్‌గా చాలా మన్నికైన పదార్థాలతో రూపొందించబడ్డాయి. ఇవి చాలా కంఫర్ట్‌గా ఉండి, మన్నికను అందిస్తాయి. అయితే లెన్స్‌‌లు అందమైన, వ్యక్తిగతీకరించిన ప్యాక్ చేసిన పెట్టెతో 100% UV రక్షణను అందిస్తాయి.
 
“వోగ్ ఐవేర్ స్వీయ భావ వ్యక్తీకరణను అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. తాప్సీ పన్నుతో కలిసి మేం రూపొందించిన ఈ సరికొత్త కలెక్షన్ మా భాగస్వామ్యాన్ని ఉత్తేజకరమైన కొత్త దశకు తీసుకెళ్లింది. ఇది మాకెంతో గర్వకారణం. ఈ కలెక్షన్ ట్రెండ్‌సెట్టింగ్, విభిన్నమైన స్టైల్స్‌ను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి తాప్సీ పన్ను తన వ్యక్తిగతతను వ్యక్తీకరించే అంశాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియుల కోసం ఈ సేకరణ తప్పనిసరిగా ఉండాలి” అని అన్నారు లగ్జరీ, ప్రీమియం & ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ గ్రూప్ హెడ్ - గుంజన్ సైగల్.