బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 జూన్ 2024 (18:27 IST)

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

Egg fried rice
ఫ్రైడ్ రైస్ రుచికరమైన ఆహారం. అయితే అధిక మొత్తం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రైడ్ రైస్ సాధారణంగా ఎక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా నూనె, ఉడికించిన గుడ్లతో తయారు చేయబడుతుంది. అధిక కేలరీలు తీసుకోవడం శరీర బరువు పెరుగుదలకు దారితీస్తుంది. 
 
ప్రైడ్ రైస్‌లో సాధారణంగా పీచు తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమస్యలు, జీర్ణసంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది. పీచు పదార్థాలు తక్కువగా వుండటం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె వ్యాధి, పక్షవాతం కొన్ని రకాల క్యాన్సర్లకు అవకాశం ఉంది.
 
ఎక్కువ సోడియం: ఫ్రైడ్ రైస్‌లో సోడియం ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా సోయా సాస్, ఫిన్ సాస్ లేదా ఉప్పు వంటి ఎక్కువ సోడియం పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుకు గుండె వ్యాధికి దారితీస్తుంది. అందుచేత వారానికి ఒక్కసారి మాత్రం ఫ్రైడ్ రైస్ తీసుకోవడం మంచిది. అంతేకానీ రోజూ ఫ్రైడ్ రైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వారు సెలవిస్తున్నారు.