శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:07 IST)

తిరుమలలో గరుడ సేవ.. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు టూవీలర్స్ నాట్ అలోడ్

garuda seva in tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం చేస్తోంది. తదుపరి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడసేవ రోజున భక్తుల రద్దీని అంచనా వేసి, యాత్రికుల భద్రత కోసం టిటిడి రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది. 
 
ఈ సంవత్సరం, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 8న అత్యంత ముఖ్యమైన గరుడ సేవ జరగనుంది.

ఈ నేపథ్యంలో గరుడ సేవను పురస్కరించుకుని అక్టోబర్ 7న రాత్రి 9 నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.