శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జులై 2024 (11:17 IST)

అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ - భారత బృందానికి సింధు సారథ్యం

pv sindhu indian team
ప్యారిస్ వేదికగా విశ్వక్రీడా పోటీలు (ఒలింపిక్స్) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నీల్ నదిపై 85 పడవల్లో 6800 మంది అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. ఇందులో 84 మంది భారత అథ్లెట్లు కూడా ఉన్నారు. భారత బృందానికి హైదరాబాద్ స్టార్ పీవీ సింధు, శరత్ కుమార్‌లు సారథ్యం వహించారు. 
 
ఫ్యాషన్ రాజధానిగా గుర్తింపు పొందిన ప్యారిస్ వేదికగా ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ పోటీల చరిత్రలోనే తొలిసారి నదిలో ఈ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఇవి ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నదిపై ఆరు కిలోమీటర్ల మేర సాగిన పరేడ్ 85 పడవలపై 6800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఒలింపిక్ చరిత్రలోనే తొలిసారి ప్రారంభోత్సవ వేడుకల్లో క్రీడాకారులు పాల్గొనడం గమనార్హం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్‌ సహా దిగ్గజ అథ్లెట్లు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రారంభోత్స వేడుకల్లో పాల్గొన్నారు. 
 
ఫ్రెంచ్ అక్షర క్రమంలో ఆయా దేశాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. భారత్ 84వ దేశంగా పరేడ్‌లో పాల్గొంది. భారత బృందానికి హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మరో ఆటగాడు శరత్ కుమార్‌లు నేతృత్వం వహించారు. త్రివర్ణ పతాకం చేతబూనగా, అథ్లెట్లు చిన్నచిన్న మువ్వెన్నెల పతాకాలను చేతపట్టుకున్నారు. తొలుత గ్రీస్ బృందం పరేడ్ నిర్వహించాగ, ఆ తర్వాత సౌతాఫ్రికా బృందం పాల్గొంది. 84 మందితో కూడిన భారత బృందం బోటులో సీవ్ నదిపై కనిపంచగానే అభిమానులు తమ మద్దతు తెలుపుతూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. 
 
అయితే, భారత పరేడ్ నీరజ్ చోప్రా వంటి స్టార్లు కనిపించకపోవడం లోటుగా అనిపించింది. కొందరు అథ్లెట్ల ఇంకా ప్యారిస్ చేరుకోవాల్సి ఉంది. భారత హాకీ పురుషుల జట్టుతో ప్యారిస్‌లో భారత్ పతకాల వేట ప్రారంభంకానుంది. అలాగే, స్టార్ షట్లర్ లక్ష్యసేన్, వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నారు.