శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (17:11 IST)

తుక్కుగూడలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే భారీ సభ

Rahul Gandhi
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6, 7 తేదీల్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయ స్థాయి సమావేశం ఉంటుందని.. కర్ణాటక, తెలంగాణల్లో గెలుపొందిన స్ఫూర్తితో జాతీయ స్థాయిలో హామీల ప్రకటన ఉంటుందన్నారు. 
 
తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి హామీలపై ప్రకటన చేస్తామన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలని వ్యాఖ్యానించారు. 
 
మన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేశామన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు ఒకదానికొకటి బంధుత్వమని చెప్పారు.