శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:53 IST)

కొన్నాళ్ళ పాటు మహేష్ బాబు సోషల్ మీడియాకూ దూరం?

Mahesh Babu
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నాళ్ళపాటు సోషల్ మీడియాలోనూ దూరంగా వుండబోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఏదోరకంగా సోషల్ మీడియాలో జిమ్ లోనూ, పిల్లలతోనూ ఆడుకునే విషయాలను భార్య నమ్రత పోస్ట్ చేస్తూ వుంటుంది. కుమార్తె సితార కూడా ఏవో అప్ డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా దిల్ రాజు సోదరుని కుమారుడు వివాహ పత్రం అందుకునేటప్పుడు గెడ్డంతో మీసాలతో కనిపించారు. ఇది ఆయన రాజమౌళి సినిమా గెలప్ అని తెలిసింది.
 
సో.. రాజమౌళి సినిమా పనిమీద బాడీని ఫిట్ నెస్ గా వుంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం పాన్ వరల్డ్ గనుక మహేష్ గెటప్ ను జాగ్రత్తగా మెయిన్ టేన్ చేయాలని దర్శకుడు రూల్ పెట్టినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఒకప్పుడు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై పలు సినిమాలు తీసిన కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి వివరాలు తెలియనున్నాయి.