నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఆరా తీసినట్టు సమాచారం.
కాగా, విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కూడా సీఐడీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పలువురు సినీ నటీనటులకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే.