Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా అనిల్ కామినేని నాయకత్వంతో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను తెలిపేందుకు ప్రధాని మోదీకి రామ్ చరణ్ వివరించారు.
ఈ సందర్భంగా చెర్రీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా మోదీని కలిసి ఫోటోలు షేర్ చేశారు. ప్రధాని మోదీ గారిని కలిసినందుకు గౌరవంగా ఉంది. ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల మీద ఉన్న అభిమానం నేడు ఆర్చరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సాయపడుతుంది అంటూ తన పోస్టులో వెల్లడించారు రామ్ చరణ్.
ప్రస్తుతం చెర్రీ పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారు. ఏపీలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతుంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.