Mysore Pak Recipe: దీపావళి వంటకాలు.. మైసూర్ పాక్ చేసేద్దాం
దీపావళి వచ్చేస్తుంది. స్వీట్స్ ముందే సిద్ధం చేసుకునే పనిలో అందరూ వుంటారు. మీరు అలా స్వీట్స్ చేయాలని అనుకుంటున్నారా.. అయితే ఈజీగా మైసూర్ పాక్ ట్రై చేయండి..
తయారీ విధానం
కావలసిన పదార్థాలు
శెనగపిండి - 3 కప్పులు
నెయ్యి - 3 కప్పులు
పంచదార - 4 కప్పులు
తయారీ విధానం:
ముందుగా శెనగపిండిని జల్లెడ పట్టాలి. స్టౌవ్ మీద కళాయి పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి అడుగంటకుండా దోరగా వేయించుకోవాలి. గిన్నెలో ఒక కప్పు నీరు, చక్కెరను వేసి పాకం వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచాలి. పాకం తయారయ్యాక దాంట్లో శెనగ పిండి వేసి గట్టి పడే వరకు ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.
ఇందులో వేడి చేసిన నెయ్యిని చేర్చుతూ వుండాలి. మాడిపోకుండా కలపాలి. ఇప్పుడు పిండి గుల్లలుగా తయారవుతుంది. తరువాత మరోసారి నెయ్యి వేసి కలుపుకుని ప్లేటులో చదరంగా ఉండే ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి చాకుతో ముక్కలుగా కోసుకుని పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి. అంతే రుచికరమైన మైసూర్ పాక్ సిద్ధం.