బుధవారం, 12 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దలతో సంభాషిస్తారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
వృషభం: కృత్తిక 2, 18, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 1, పాదాలు
ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం ధనసహాయం తగదు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 13 పాదాలు
ఆచితూచి అడుగేయాలి. భేషజాలకు పోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు యత్నిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పసులు సాగవు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశాలకు సన్నాహాలు సాగిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్వానికి శ్రీకారం చుడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సమష్టి కృషితో లక్ష్యం సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు ముందుకు సాగవు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. రెట్టింపు ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనలాభం ఉంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. శుభకార్యానికి హాజరుకాలేరు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వస్త్రప్రాప్తి వాహనయోగం ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు, ముఖ్యుల కలయిక వీలుపడదు, సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.
 
మకరం : ఉత్తర 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు  
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం, కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. తలపెట్టిన పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం, అప్రమత్తంగా ఉండాలి. తెలిసిన వ్యక్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యమని గ్రహించండి. పనులు అనుకున్న విధంగా సాగవు ఊహించని ఖర్చు ఎదురవుతుంది. మీ జోక్యం అనివార్యం. గృహోపకరణాలు మరమ్మతులు గురవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్నివిధాలా అనుకూలంగా ఉంది. శుభవార్త అంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆచితూచి వ్యవహరించాలి. సేవా సంస్థలకు విరాళాలందిస్తారు.